న్యూఢిల్లీ, నవంబర్ 2: జీమెయిల్లో అంతర్నిర్మితమైన టెక్ట్స్, వీడియో, వాయిస్ చాటింగ్ యాప్ ‘గూగుల్ హ్యాంగౌట్స్’కు గూగుల్ సంస్థ గుడ్‌బై చెప్పింది. ఈ యాప్‌ను ‘గూగుల్ చాట్’గా అప్‌గ్రేడ్ చేసింది. మంగళవారంతో యూజర్లకు గూగుల్ హ్యాంగౌట్స్ వెబ్ యాప్ సేవలు ముగిశాయి. ఆ తర్వాత యూజర్లను ఆటోమేటిక్‌గా ‘చాట్ ఆన్ వెబ్’కు మళ్లించామని అధికారిక రిపోర్టు పేర్కొన్నది.
గూగుల్ హ్యాంగౌట్స్ ఇకపై ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో అందుబాటులో ఉండదు. ఆధునిక ఫీచర్లు, హంగులతో వచ్చిన గూగుల్ చాట్‌లో యూజర్లు పలు రూపాల్లో తమకు వచ్చిన మెసేజ్‌లకు రిైప్లెలు పంపొచ్చు. హ్యాంగౌట్స్‌లో ఉండే మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా గూగుల్ చాట్‌లోకి వస్తాయి.