న్యూఢిల్లీ, జూన్ 5 : సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మళ్లీ ఉద్యోగులను తొలగించింది. గూగుల్ 2022లో కొనుగోలు చేసిన సైబర్ సెక్యూరిటీతో పాటు, క్లౌడ్ డివిజన్, థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్లో ఉద్యోగలుపై వేటు వేసింది. గత రెండు వారాలుగా ఈ ఉద్యోగాల కోత జరుగుతూనే ఉంది.
ఏఐలో పెట్టుబడితో పాటు మెరుగైన లాభాల కోసమే ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్టు తెలుస్తున్నది. మెటా సంస్థ 10 శాతం ఉద్యోగులను గత నెలలోనే తీసేసింది. ఉద్యోగ కోతలపై గూగుల్ స్పందించింది. టెక్ రంగంలో మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని.. సంస్థ అభివృద్ధి కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది.