న్యూఢిల్లీ: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్.. చిన్న వ్యాపారుల కోసం నిర్వహిస్తున్న హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని మూసేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఫలితంగా ఇండియాలో వందలాది మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు తెలుస్తున్నది. అమెజాన్ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని మైసూరు, బెంగళూరు, హుబ్లీ నగరాల్లో నిర్వహిస్తున్నది. వార్షిక కార్యకలాపాల సమీక్ష ప్రక్రియలో భాగంగా అమెజాన్ ఈ వ్యాపారాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం అటు ఉద్యోగులపైనే కాక చిన్న వ్యాపారులపై కూడా ప్రభావం చూపనుంది. ఈ వ్యాపార కార్యకలాపాలను దశలవారీగా నిలిపివేస్తామని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.