52 కోట్ల విలువైన బంగారు టాయిలెట్ చోరీ
కాదేదీ చోరీకి అనర్హం అన్న విషయాన్ని రుజువు చేస్తూ యూకేలోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో రూ.52 కోట్ల విలువైన 18 క్యారట్ల బంగారు టాయిలెట్‌ను కొందరు చోరులు ఐదు నిమిషాల్లో అపహరించారు. 2019కు చెందిన ఈ కేసును బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు సోమవారం విచారించింది.
- 5 నిమిషాల్లో అపహరించిన ఐదుగురు దొంగలు
న్యూఢిల్లీ : కాదేదీ చోరీకి అనర్హం అన్న విషయాన్ని రుజువు చేస్తూ యూకేలోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో రూ.52 కోట్ల విలువైన 18 క్యారట్ల బంగారు టాయిలెట్‌ను కొందరు చోరులు ఐదు నిమిషాల్లో అపహరించారు. 2019కు చెందిన ఈ కేసును బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు సోమవారం విచారించింది. డొనాల్డ్ ట్రంప్ కెరీర్‌తో ముడిపడి ఉన్న ఈ బంగారు టాయిలెట్ 2019 సెప్టెంబర్‌లో ఆక్స్‌ఫర్డ్‌లోని ప్యాలెస్‌లో ఏర్పాటు చేయగా, తెల్లవారు జామున ప్రవేశించిన నిందితులు ఐదు నిమిషాల్లో దానిని పెకలించుకుని పోయారు. అనంతరం పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే వారి నుంచి ఆర్ట్‌వర్క్‌ను ఇంకా స్వాధీనం చేసుకోలేదని, దానిని వారు విడగొట్టి అమ్మేసి ఉంటారని వారు భావిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ముందస్తు ప్లాన్‌తో ఈ భారీ చోరీకి పాల్పడి ఉంటారని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితులపై దోపిడీ, ఆస్తి బదలాయింపునకు కుట్ర, తదితర ఆరోపణలు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

