Gold price : దేశంలో బంగారం ధరలు (Gold rates) భారీగా తగ్గాయి. ఒకానొక దశలో లక్ష మార్కును దాటిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అక్షయ తృతీయ తర్వాత మూడు రోజుల్లో 10 గ్రాముల 22 క్యారట్ బంగారం ధర ఏకంగా రూ.2,200 తగ్గింది. గత కొన్ని రోజులుగా బలహీన పడుతూ వచ్చిన అమెరికా డాలర్ (US dollar) విలువ తిరిగి పుంజుకోవడమే ఇందుకు కారణమని బులియన్ నిపుణులు చెప్పారు.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతుండటం కూడా భారత్‌తోపాటు పలు దేశాల్లో బంగారం ధరలు తగ్గడానికి కారణమని బులియన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇవాళ దేశంలో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.95,510 గా ఉంది. తులం 22 క్యారట్ గోల్డ్ ధర రూ.87,550కి దిగివచ్చింది. అదేవిధంగా 18 క్యారట్ బంగారం ధర రూ.71,640 కి పడిపోయింది.
అదేవిధంగా కిలో వెండి ధర శుక్రవారం రూ.98 వేలు పలుకుతోంది. అంటే గురువారం ధరలతో పోల్చితే వెండి ధరల్లో ఏమాత్రం మార్పు లేదు. గురువారం కూడా కిలో వెండి ధర రూ.98 వేలు పలికింది.