కంచే చేను మేసింది.. న్యూ ఇయర్ పార్టీ కోసం మేకలను దొంగిలించిన పోలీస్!
goats halal on new years eve.. police accused of theft | కంచే చేను మేసిందన్న చందంగా.. దోపిడీలు, దొంగతనాలను అరికట్టాల్సిన పోలీసులే న్యూ ఇయర్ దావత్ కోసం కక్కుర్తిపడ్డాడు. రెండు మేకలను

భువనేశ్వర్ : కంచే చేను మేసిందన్న చందంగా.. దోపిడీలు, దొంగతనాలను అరికట్టాల్సిన పోలీసులే న్యూ ఇయర్ దావత్ కోసం కక్కుర్తిపడ్డాడు. రెండు మేకలను దొంగిలించి చివరకు ఓ ఏఎస్ఐ సస్పెండ్ అయ్యాడు. ఈ ఘటన ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. బలంగీర్ జిల్లా సింధికెల గ్రామానికి చెందిన సంకీర్తన గురు అనే వ్యక్తి ఈ నెల 31న మేకలను మేపుకునేందుకు వెళ్లగా.. మందలో నుంచి రెండు రెండు మేకలు మాయమయ్యాయి. వాటి కోసం చుట్టుపక్కల అంతటా వెతికారు. ఎక్కడా కనిపించలేదు.
మేకలు మేపుతున్న ప్రాంతానికి దగ్గరలోనే పోలీస్ స్టేషన్ ఉండగా.. అక్కడ రెండు మేకలను కోస్తుండగా సంకీర్తన గురు కూతురు చూసింది. ఈ విషయాన్ని తండ్రికి తెలిపింది. దీంతో సంకీర్తన గురు మేకలకు సంబంధించి డబ్బులు ఇవ్వాలని అడిగితే ఇవ్వకుండా.. బెదిరింపులకు దిగారు. దీంతో సంకీర్తన గురు విషయాన్ని గ్రామస్తులకు వెల్లడించాడు. అందరు కలిసి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని పోలీసులను నిలదీశారు. ఈ విషయం బలంగీర్ ఎస్పీ వద్దకు వెళ్లింది. దీంతో ఏఎస్ఐ సుమన్ మల్లిక్‌ను ఎస్పీ సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

