న్యూఢిల్లీ, డిసెంబర్ 16: గోవాలో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ యజమానులైన గౌరవ్ లూథ్రా, సౌరభ్ లూథ్రాలను గోవా పోలీసులు మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. భారత దర్యాప్తు అధికారులు వారిని థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. వారిని ఢిల్లీలోని పాటియాల హౌస్ కోర్టులో హాజరు పరిచిన తర్వాత వారి ట్రాన్సిట్ రిమాండ్‌ను మంజూరు చేయాలని గోవా పోలీసులు కోర్ట్‌ను కోరతారు.
మరోవైపు బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ ఆస్తికి సంబంధించిన ఒక సివిల్ దావాను మంగళవారం బాంబే హైకోర్ట్ గోవా ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మార్చింది. ఇలాంటి కేసుల్లో జవాబుదారీ ఉండాలని.. ఆ క్లబ్‌కు జారీ చేసిన లైసెన్స్‌లపై స్పందన తెలుపాలని కోర్టు గోవా ప్రభుత్వాన్ని కోరింది.