పనాజీ: అరేబియా సముద్ర తీరంలోని రాష్ట్రాలను తౌటే తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఆయా రాష్ట్రాల్లో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం, దాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలు తదితర అంశాలపై చర్చించారు.
అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని విభాగాలకు పలు సూచనలు చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అత్యవసర సేవలు అన్నింటిని పునరుద్ధరించాలని చెప్పారు. తుఫాన్ నష్టానికి సంబంధించి అన్ని వివరాలను ఎప్పటికప్పుడు పొందుపర్చాలని ఆదేశించారు.
Goa Chief Minister Pramod Sawant held a meeting to review the Tauktae cyclone impact in the state via video conference.
— ANI (@ANI) May 17, 2021
"Issued directions to all the State Govt Departments to work on war footing to restore essential services and also assess the damage in detail," he says. pic.twitter.com/V6vKaEkWRO