ఇండోర్: బీజేపీ నేత కైలాశ్ విజయ్‌వర్గీయ(Kailash Vijayvargiya) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్ల దుస్తులపై ఆయన కామెంట్ చేశారు. సరైన దుస్తులు వేసుకోని ఆడవాళ్లను ఆయన సూర్పనకతో పోల్చారు. ఇండోర్‌లో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేవారు. రాత్రి పూట బయట తిరుగుతున్న సమయంలో మత్తులో ఉన్న యువతను చూస్తుంటానని, వాళ్ల చెంప పగలగొట్టాలన్న కోసం వస్తుందని ఆయన అన్నారు.
BJP Leader @KailashOnline says girls dress badly & look like ‘Shurpanakha’. This is a reprehensible & demeaning insult to every woman of this country
Where is @smritiirani now? Does she condone this disgusting statement? Or does she only find her voice to attack @RahulGandhi! pic.twitter.com/hzoxrnZpl1
— Dr. Shama Mohamed (@drshamamohd) April 8, 2023
ఇక సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిలను ఆయన తప్పుపట్టారు. మహిళలను దేవతులగా ఆరాధిస్తామని, కానీ సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిల్లో ఆ ఆనవాళ్లు ఉండవన్నారు. వాళ్లు సూర్పనకలాగా కనిపిస్తారన్నారు. దేవుడు మీకు మంచి శరీరాన్ని ఇచ్చారని, మంచి దుస్తులు వేసుకోవాలని ఆయన అన్నారు. పిల్లలకు మంచి బుద్దులు నేర్పాలని ఆయన సూచన చేశారు. బీజేపీ నేత కైలాశ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.