లక్నో: ఒక వ్యక్తితో కలిసి అతడి కారులో ఉన్న భార్యను ఆమె భర్త చూశాడు. ఆ కారును అడ్డుకుని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రియురాలి భర్తను కారు బానెట్‌పై అతడు ఈడ్చుకెళ్లాడు. (Man On Bonnet) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. మహీర్తో కలిసి అతడి కారులో భార్య ఉండటాన్ని సమీర్ అనే వ్యక్తి చూశాడు. తన బైక్‌తో ఆ కారును అడ్డుకుని ఆపడానికి ప్రయత్నించాడు.
కాగా, మహీర్ తన కారును ఆపలేదు. డ్రైవ్ చేయడంతో కారు ముందున్న సమీర్ బానెట్‌పై పడ్డాడు. దానిని పట్టుకుని వేలాడుతున్న అతడ్ని కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లాడు. పలువురు వాహనదారులు ఇది గమనించారు. కారును ఆపమని డ్రైవర్‌కు సూచించారు. అతడు లెక్కచేయకపోవడంతో తమ వాహనాల్లో వెంబడించి కారును అడ్డుకున్నారు.
అనంతరం మహీర్తో సమీర్ ఘర్షణకు దిగాడు. కారు బానెట్‌పై తనను ఈడ్చుకెళ్లడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మహీర్‌ను అరెస్ట్ చేశారు. అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కొందరు వాహనదారులు రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Moradabad
कार में प्रेमी संग जा रही थी बीवी, रोकने के लिए बोनट पर लटक गया पति, शहर में दौड़ती रही गाड़ी…#ViralVideos pic.twitter.com/I5ODKQxZ8U— Ashish Mishra (@AshishMisraRBL) January 16, 2025