న్యూఢిల్లీ: ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి రేకులు, వస్తువులు ఎగిరిపడ్డాయి. అయితే ఒక బాలిక ఆ ఇంటి ముందు నుంచి నడిచి వెళ్లింది. ఆ చిన్నారి తృటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నది. (Girl Narrowly Escapes) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం షహబాద్ డెయిరీ ప్రాంతంలోని ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి రేకులు, పలు వస్తువులు ఎగిరిపడ్డాయి. మనోజ్, నవీన్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, గ్యాస్ సిలిండర్ పేలుడుకు కొన్ని క్షణాల ముందు ఒక బాలిక అక్కడి రోడ్డుపై నడిచి వెళ్లింది. ఈ ప్రమాదం నుంచి తృటిలో ఆమె తప్పించుకున్నది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు సోమవారం పశ్చిమ ఢిల్లీ రాజౌరీ గార్డెన్ మార్కెట్ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక ఇన్స్టిట్యూట్కు చెందిన పలువురు విద్యార్థులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. మంటలు చెలరేగిన భవనం నుంచి పక్క బిల్డింగ్ రూఫ్పైకి దూకారు. ఈ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
शाहबाद डेरी में बीती रात अचानक हुआ सिलेंडर ब्लास्ट सिलेंडर ब्लास्ट में मनोज व नवीन दो लोग गंभीर रूप से घायल घटना CCTV कैमरे में कैद @DelhiPolice @dcp_outernorth #viral #ViralVideos #VideoViral pic.twitter.com/suIqKW5caY
— Dev Singh (@TezT24) December 9, 2024
VIDEO | People jump off to the roof of a neighbouring building after a fire broke out at Jungle Jamboree restaurant in Delhi’s Rajouri Garden earlier today. pic.twitter.com/sdfwDxnCnc
— Press Trust of India (@PTI_News) December 9, 2024