ఎప్పట్లాగే స్కూల్‌కు వచ్చిందా బాలిక. బ్యాగులో పుస్తకాలు తీసుకుంటుంటే చేతికేదో చల్లగా తగిలింది. ఏంటా? అని పట్టుకోబోతే చటుక్కున పక్కకు జరిగిందా వస్తువు. దీంతో భయపడిపోయిన ఆ బాలిక.. బ్యాగులో ఏదో కదులుతోందని టీచర్‌కు చెప్పింది. దీంతో అనుమానంగా ఆ బ్యాగులో చూసిన టీచర్ గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఆ బ్యాగులో పుస్తకాల మధ్య చుట్టలు చుట్టుకొని ఉన్న నల్లతాచు కనిపించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో వెలుగు చూసింది.
ఇక్కడి బదోనీ స్కూల్లో చదువకునే ఒక విద్యార్థిని బ్యాగులో తాచుపాము కనిపించింది. సదరు స్కూల్ టీచర్.. ఆ బాలిక బ్యాగును తీసుకొని, దానిలోని పుస్తకాలన్నీ కింద పడేశాడు. వాటి మధ్యలో ఉన్న నల్లతాచు కూడా కింద పడి బుసలు కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం.
कक्षा 10 की छात्रा कु. उमा रजक के बैग से, घर से स्कूल आकर जैसे ही बैग खोला तो छात्रा को कुछ आभाष हुआ तो शिक्षक से शिकायत की, कि बस्ते में अंदर कुछ है, छात्रा के बैग को स्कूल के बाहर ले जाकर खोला तो बैग के अंदर से एक नागिन बाहर निकली, यह घटना दतिया जिले के बड़ोनी स्कूल की है। pic.twitter.com/HWKB3nktza
— Karan Vashistha BJP 🇮🇳 (@Karan4BJP) September 22, 2022