ముంబై: ఒక బిల్డర్ యువతి చెంపపై కొట్టాడు. దీంతో అదుపుతప్పిన ఆమె ఆ బిల్డింగ్ పైనుంచి కిందపడింది. (Girl falls off building) తీవ్రంగా గాయపడిన ఆ యువతి బాధతో ఏడ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఆస్తి వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తి, యువతి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో బిల్డర్ అయిన అతడు ఆ యువతి చెంపపై గట్టిగా కొట్టాడు. దీంతో అంచున ఉన్న ఆ యువతి అదుపుతప్పింది. ఆ భవనం పైనుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమె బాధతో అల్లాడిపోయింది.
కాగా, యువతిపై దాడి చేసిన వ్యక్తిని స్థానిక బిల్డింగ్ డీలర్ మోను సక్సేనాగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న అతడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A dealer named Monu Saxena Pushed a m!nor girl from the roof over some land iasues, Anan Vihar Delhi
pic.twitter.com/7HoIt6VEbG— Ghar Ke Kalesh (@gharkekalesh) July 27, 2024