లక్నో: డ్యాన్స్ చేస్తున్న గుంపుపై భారీ మ్యూజిక్ సిస్టమ్ పడింది. (Giant Music System Falls) ఈ నేపథ్యంలో పలువురు యువకులు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫూల్పూర్లో దసరా అనంతరం దుర్గామాత విగ్రహం నిమజ్జనం కోసం ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక వాహనంపై భారీ డీజే మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దాని ముందు కొందరు యువకులు డ్యాన్స్ చేశారు.
కాగా, వాహనం కుదుపులకు భారీ డీజే మ్యూజిక్ సిస్టమ్ పలుమార్లు ఊగింది. అయితే ఆ వాహనం స్పీడ్ బ్రేకర్ దాటినప్పుడు ఆ భారీ మ్యూజిక్ సిస్టమ్ పడిపోయింది. ఆ సమయంలో అక్కడ డ్యాన్స్ చేస్తున్న యువకులు దాని కింద చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. డీజే మ్యూజిక్ సిస్టమ్‌కు చెందిన వారితోపాటు ఊరేగింపు నిర్వాహకులు, వాహనం డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, భారీ మ్యూజిక్ సిస్టమ్ గుంపుపై పడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A DJ fell on people dancing in front of it in Uttar Pradesh's #Azamgarh, injuring four people. #Viralvideo pic.twitter.com/AxBmKaqARG
— Yauvani (@yauvani_1) October 30, 2023