లక్నో, ఏప్రిల్ 8: ఉత్తరప్రదేశ్లోని జైళ్లలో ఉన్న ఖైదీలకు ఇకపై మహామృత్యుంజయ జపం, గాయత్రీ మంత్రాన్ని వినిపించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి ధర్మవీర్ ప్రజాపతి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఖైదీలకు మానసిక ప్రశాంతంత అందించేందుకు వీటిని ప్లే చేస్తామని ఆయన పేర్కొన్నారు.