న్యూఢిల్లీ : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్), 2025 ఫలితాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు గేట్ 2025 అధికారిక వెబ్సైట్ https://goaps.iitr.ac.in/login ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. స్కోర్ కార్డులను ఈ నెల 28 నుంచి మే 31 వరకు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ గడువు ముగిసిన తర్వాత ప్రతి టెస్ట్ పేపర్‌కు రూ.500 చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఐఐటీ రూర్కీ ఈ పరీక్షలను ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించింది.