మీరట్, ఫిబ్రవరి 2: ఒక వ్యక్తి 40 వేల రుణం తీసుకుని, దానిని ఇద్దరు కిరాయి వ్యక్తులకు సుపారీ ఇచ్చి సొంత మరదలిపై సామూహిక లైంగిక దాడి, హత్య చేయించిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. మీరట్‌లోని నాను కెనాల్ వద్ద జనవరి 21న జరిగిన ఈ దారుణానికి సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆశిష్ అనే వ్యక్తి తన భార్య చెల్లెలుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆమె బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించడంతో ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. 40 వేల రూపాయలు రుణం తీసుకుని హత్య చేయడానికి శుభం, దీపక్‌లతో 30 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇద్దరు నిందితులు ఆమెను అపహరించి సామూహిక లైంగిక దాడి చేసి అనంతరం హత్య చేసి పరారయ్యారు.