గ్వాలియర్, జూన్ 11: ఇద్దరు వ్యక్తులు 16 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని ఓ మిత్రుడికి లైవ్‌స్ట్రీమ్ చేశారు. ఈ ఘటన బీజేపీపాలిత మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకున్నది. నిందితులు పరారీలో ఉన్నారు. సుమారు 21 ఏండ్లు ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ నెల రెండున హోటల్‌కు తీసుకెళ్లి తనపై లైంగికదాడి చేసినట్టు బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు బాలికపై లైంగికదాడి ఘటనను ఓ మిత్రుడికి లైవ్ స్ట్రీమ్ చేయడంతోపాటు ఫొటోలు, వీడియో చిత్రీకరించారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నిందితులపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.