Watch: పార్కింగ్ వివాదం.. మహిళను సజీవ దహనం చేసేందుకు యత్నం
Gang Attempts To Burn Woman Alive | వాహనాల పార్కింగ్ వివాదం నేపథ్యంలో మహిళను సజీవ దహనం చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఆమె తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరుగులు తీసింది. దీంతో దుండగులు ఆమె కారును ధ్వంసం చేయడంతోపాటు దానికి నిప్పంటించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: వాహనాల పార్కింగ్ వివాదం నేపథ్యంలో మహిళను సజీవ దహనం చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. (Gang Attempts To Burn Woman Alive) అయితే ఆమె తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరుగులు తీసింది. దీంతో దుండగులు ఆమె కారును ధ్వంసం చేయడంతోపాటు దానికి నిప్పంటించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పూణెలోని చందన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖరాడి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. స్థానికంగా నివసిస్తున్న మహేష్ రాజే, ఆ ప్రాంతానికి చెందిన కొందరి మధ్య కొన్ని రోజులుగా పార్కింగ్ విషయంలో వివాదం జరుగుతున్నది.
కాగా, ఫిబ్రవరి 17న పార్కింగ్ వివాదం తీవ్రమైంది. దీంతో ముఖాలకు ముసుగులు వేసుకున్న కొందరు వ్యక్తులు కర్రలు చేతపట్టి బైక్పై ఆ మహిళ ఇంటికి చేరుకున్నారు. ఆమె కారును ధ్వంసం చేశారు. పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఇంటి నుంచి బయటకు వస్తున్న రాజేపై కూడ పెట్రోల్ పోసి సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ఇంట్లోకి పరుగులు తీసి తప్పించుకున్నది. ఇది చూసి అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు.
మరోవైపు ఆ మహిళ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 28 ఏళ్ల ధీరజ్ దిలీప్ సపటే, 23 ఏళ్ల ఆకాష్ సోకిన్ సోడే, 19 ఏళ్ల నయత్ నితిన్ గైక్వాడ్, 23 ఏళ్ల సూరజ్ రవీంద్ర బోరుడే, 20 ఏళ్ల విశాల్ ససానేపై ఆరోపణలు చేసింది. దీంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేర చరిత్ర ఉన్న ధీరజ్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | #Pune: Group Of Men Attempt To Burn Woman Alive Over Parking Dispute; Victim Makes Narrow Escape#Crime #PuneNews #Maharashtra pic.twitter.com/KSqqiWHvoX
— Free Press Journal (@fpjindia) February 19, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

