న్యూఢిల్లీ: గెయిన్‌బిట్‌కాయిన్ కుంభకోణం కేసులో సీబీఐ సోదాలు ముగిశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ, పుణే, నాందేడ్, కొల్హాపూర్, ముంబై, బెంగళూరు, చండీగఢ్, మొహాలి, ఝాన్సీ, హుబ్లిలలో దాదాపు 60 చోట్ల మంగళ, బుధవారాల్లో ఈ సోదాలు జరిగాయి. ఈ కేసులో రూ.23.94 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీలను సీబీఐ స్వాధీనం చేసుకుంది.
కొన్ని హార్డ్‌వేర్ క్రిప్టో వ్యాలెట్లు, 121 పత్రాలు, 34 ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు; 12 మొబైల్ ఫోన్లు, ఈ-మెయిల్, ఇన్స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ డంప్స్ను స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ లావాదేవీలు, నిధుల దుర్వినియోగం గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఎలక్ట్రానిక్ డివైస్‌లను ఫోరెన్సిక్ అనాలసిస్‌కు పంపించింది. ఈ కుంభకోణం అత్యంత సంక్లిష్టంగా ఉండటంతో సుప్రీంకోర్టు దీనిపై దర్యాప్తు బాధ్యతను సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ)కు అప్పగించింది.