న్యూఢిల్లీ: కోపంతో ఉన్న వధువు, వరుడి చేతిపై ఉమ్మింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ వధువు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. (Bride Spitt On Groom’s Hand) మే 12న ఒక జంటకు పెళ్లి జరిగింది. అయితే పూల దండ వేసే సమయంలో వధువు చేయి పట్టుకునేందుకు వరుడు ప్రయత్నించాడు. అప్పటికే కోపంగా ఉన్న పెళ్లికూతురు అనుచితంగా ప్రవర్తించింది. పెళ్లికొడుకు చేతిపై ఉమ్మి వేసింది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అమర్యాదకు పరాకాష్ట అని ఒకరు విమర్శించారు. వరుడు పెళ్లివేదిక నుంచి వెళ్లిపోయి ఉండాల్సింది అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోకూడదని మరొకరు సూచించారు.
మరోవైపు ఇష్టంలేని పెళ్లి కోసం ఆ అమ్మాయిని బలవంతం చేసి ఉంటారని, లేదా వరుడు ఆమెకు నచ్చకపోయి ఉండవచ్చని, అందుకే ఆమె అలా ప్రవర్తించి ఉంటుందని ఒకరు పేర్కొన్నారు. అయితే ఇది రీల్ స్టంటా? లేక నిజంగా జరిగిందా? అని మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు.
वरमाला के समय लड़की का हाथ थामने के लिए जैसे ही लड़के ने हाथ आगे बढ़ाया लड़की ने हाथ पर थूक दिया ,
अगर लड़की शादी से खुश नहीं थी तो इतना बखीरा खड़ा करने की क्या जरूरत थी ,
लड़के की कितनी बेज़्जती हुई होगी ,क्या लगता इसके बाद लड़के ने शादी की होगी?pic.twitter.com/uRi1LX9TBO
— Shivam Yadav (@ShivamYadavjii) May 14, 2025