e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News క‌రోనా నుంచి రిక‌వ‌రీ.. వ్యాక్సినేష‌న్‌ కంప్లీట్‌.. అయినా మ‌ళ్లీ పాజిటివ్‌..!

క‌రోనా నుంచి రిక‌వ‌రీ.. వ్యాక్సినేష‌న్‌ కంప్లీట్‌.. అయినా మ‌ళ్లీ పాజిటివ్‌..!

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో తొలి డెల్టా ప్ల‌స్ వేరియంట్ క‌రోనా కేసు న‌మోదైంది. గ‌త మే నెల‌లో క‌రోనా నుంచి కోలుకున్న ఓ 65 ఏండ్ల‌ మ‌హిళ ఆ త‌ర్వాత‌ రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్‌లు కూడా వేయించుకున్న‌ది. తాజాగా అమె మ‌రోసారి ప‌రీక్ష‌లు చేయించుకోగా డెల్టా ప్ల‌స్ వేరియంట్ క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌స్తుతం ఆ మ‌హిళ ఆరోగ్యంగానే ఉన్న‌ద‌ని రాజ‌స్థాన్ ప్ర‌భుత్వ అధికారులు తెలిపారు.

తాజా కేసుతో దేశంలో డెల్టా ప్ల‌స్ వేరియంట్ వెలుచూసిన రాష్ట్రాల జాబితాలో రాజ‌స్థాన్ కూడా చేరింది. స‌ద‌రు మ‌హిళ శాంపిల్స్‌ను మే 31 ఒక‌సారి, ఆ త‌ర్వాత 25 రోజుల‌కు ఒక‌సారి ప‌రీక్ష‌ల నిమిత్తం నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీకి పంపిన‌ట్లు బిక‌నీర్‌లోని పీబీఎం ఆస్ప‌త్రి వైద్యులు తెలిపారు. ఆమెలో డెల్టా ప్ల‌స్ వేరియంట్ ఉన్న‌ట్లు తేల‌డంతో ఈ కేసును ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకున్న‌ది.

- Advertisement -

స‌ద‌రు మ‌హిళ ఇరుగు పొరుగు వారిలో ఆమెతో కాంటాక్ట్ అయిన వారు అంద‌రినీ ట్రేస్ చేయాల‌ని బిక‌నీర్ సీఎంహెచ్‌వో ఓపీ చాహ‌ర్ స్థానిక ఆరోగ్య సిబ్బందికి సూచించారు. గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలో ఆ ఏరియాలో క‌రోనా పాజిటివ్ వ‌చ్చి కోలుకున్న అంద‌రికీ మ‌రోసారి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. స్థానికంగా వెలుగుచూసిన కేసులు రాష్ట్ర‌మంత‌టా వ్యాపించ‌కుండా అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana