న్యూఢిల్లీ: తేయాకు తోటల నుంచి సేకరించిన ఆకుతో కాకుండా హెర్బల్ పదార్థాలు, మొక్కలతో తయారుచేసిన వస్తువును టీగా ప్రచారం చేసి విక్రయించరాదని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహార వ్యాపార నిర్వాహకులను హెచ్చరించింది.
చట్ట ప్రకారం ఇది తప్పుడు బ్రాండింగ్గా, వినియోగదారులను తప్పుదారి పట్టించే పోకడలుగా అథారిటీ అభివర్ణించింది. రూయిబోస్ టీ, హెర్బల్ టీ, ఫ్లవర్స్ టీ పేరిట అనేక ఆహార వ్యాపార నిర్వాహకులు(ఎఫ్బీఓ)లు తమ వస్తువులను మార్కెటింగ్ చేయడం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది.