న్యూఢిల్లీ: టెలిఫోన్ వినియోగదారులు పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ పెయిడ్‌కు, ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మారాలంటే 90 రోజుల కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండేది. దీనిని 30 రోజులకు తగ్గిస్తూ టెలికం శాఖ ఈ నెల 10న ఆదేశాలు ఇచ్చింది. వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత ప్రక్రియ ద్వారా ఈ విధంగా ప్లాన్‌ను మార్చుకోవచ్చు. యూజర్లు తమ టెలికం ప్రొవైడర్ ఔట్లెట్లను సందర్శించి నచ్చిన ప్లాన్‌కు మారవచ్చు. అయితే, ఈ కాలపరిమితి తగ్గింపు మొదటిసారి మాత్రమే వర్తిస్తుంది. మరోసారి మారాలంటే కూలింగ్ ఆఫ్ పీరియడ్ 90 రోజులు తప్పనిసరి.