అగర్తలా: రైతులను అన్నదాతలు అంటారు. ఎందుకంటే వారు ఆరుగాలం కష్టించి పండించిన పంటలతో దేశ ప్రజలకు కడుపు నింపుతారు కాబట్టి. కానీ, ఒక్కోసారి కరువుకాటకాలు తాండవిస్తుంటాయి. వాటి ప్రభావం అందరిపై ఎంతో కొంత ఉన్నా రైతుల బతుకులను మాత్రం తలకిందులు చేస్తాయి. అందుకే రైతులు కరువంటే భయంతో వణికిపోతారు. సకాలంలో వానలు పడకపోతే రకారకాల ఆచారాలతో వరుణ దేవుడికి ప్రార్థనలు చేస్తారు.
తాజాగా త్రిపుర రాష్ట్రంలోని ఓ గ్రామంలో అలాంటి ఘటనే చోటుచేసుకున్నది. వరుణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించాలని మొక్కుతూ గ్రామస్తులు కప్పలకు పెండ్లి చేశారు. రెండు కప్పలకు చెరువులో స్నానం చేయించి, కొత్త బట్టలు వేశారు. కప్పలు నుదుట సింధూరం దిద్ది, దండలు మార్పించారు. ఈ పెండ్లి వీడియోను మీరు కూడా వీక్షించండి..
#Watch| Frogs married off in Tripura to please rain god
— ANI (@ANI) May 6, 2021
Two toads were married performing all the rituals from bath in pond or river to new dresses, exchange of garlands, and applying of vermilion (sindoor). pic.twitter.com/qObo5i4qmM
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
దర్శకుడికి కరోనా.. చికిత్సకు సాయం చేసిన కమెడీయన్
ఇంటినుంచే ఇంజినీరింగ్ పరీక్షలు
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు