గురుగ్రామ్: హర్యానాలోని నుహ్ జిల్లాలో జరిగిన మత ఘర్షణల వల్ల గురుగ్రామ్ ప్రాంతంలో ఇవాళ మసీదుల(Gurugram Mosques)ను బంద్ చేశారు. శుక్రవారం ప్రార్థనలపై ఆంక్షలు విధించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనలు ఇంటి వద్దే చేసుకోవాలని ముస్లింలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నుహ్ అల్లర్లలో ఇద్దరు హోంగార్డులతో సహా ఆరుగురు మృతిచెందారు. దాంట్లో ఓ ముస్లిం మతపెద్ద కూడా ఉన్నారు.
సోమవారం విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ర్యాలీలో హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రాళ్లతో ఓ గుంపు ఆ ర్యాలీపై అటాక్ చేసింది. దీంతో సుమారు 2500 మంది ఓ ఆలయంలో ఆశ్రయం తీసుకున్నారు. ఆ రోజున సాయంత్రం హింస మరింత తీవ్రమైంది. ఓ మసీదుకు నిప్పుపెట్టారు. వందల సంఖ్యలో వాహనాలను దగ్ధం చేశారు.