Krishna Byre Gowda | డీకే శివకుమార్‌కు ఇంకా తగ్గని తలనొప్పులు.. ఢిల్లీ బాట పడుతున్న అసంతృప్తులు
Krishna Byre Gowda | కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ (Dk Shivakumar) కు సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు ఇంకా తగ్గలేదు. శాఖల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ మరో మంత్రి అలకబూనారు. అంతేకాదు అధిష్ఠానంతో చర్చల కోసం ఆయన ఢిల్లీకి బయలుదేరారు. మంత్రి కృష్ణబైరె గౌడ (Krishna Byre Gowda) కు గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖను కేటాయించారు.
Krishna Byre Gowda : కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ (Dk Shivakumar) కు సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు ఇంకా తగ్గలేదు. శాఖల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ మరో మంత్రి అలకబూనారు. అంతేకాదు అధిష్ఠానంతో చర్చల కోసం ఆయన ఢిల్లీకి బయలుదేరారు. మంత్రి కృష్ణబైరె గౌడ (Krishna Byre Gowda) కు గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖను కేటాయించారు. అయితే ఆ శాఖలోని బెంగళూరు అభివృద్ధి అథారిటీ (BDA), బెంగళూరు మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి అథారిటీ (BMRDA) వంటి కీలక విభాగాలను మాత్రం సీఎం తన వద్దే ఉంచుకున్నారు. దీనిపై కృష్ణ బైరె గౌడ అసంతృప్తిగా ఉన్నారు.
దీనిపై సీఎం డీకే శివకుమార్‌ను కూడా ఆయన కలిశారు. ఈ సమస్యపై పూర్తి పరిష్కారం వచ్చిన తర్వాతే బాధ్యతలు తీసుకుంటానని కృష్ణ బైరె గౌడ స్పష్టంచేశారు. ఢిల్లీకి వెళ్లిన ఆయన.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా నగరాభివృద్ధి శాఖను తనకు కేటాయించకపోవడంపై ఇటీవల సీనియర్ నేత రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన ప్రమాణం చేసిన రెండు రోజుల్లోనే నీటిపారుదల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీ ఆయనకు నచ్చజెప్పడంతో రాజీనామాను వెనక్కి తీసుకున్నారు.
ఇప్పుడు ఆ నగరాభివృద్ధి శాఖ కేటాయించినా కృష్ణ బైరె గౌడ అసంతృప్తిగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇలా కొందరు తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తంచేస్తుంటే.. మరికొందరు ఎమ్మెల్యే మంత్రివర్గంలో చోటుదక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు. శాఖల విషయంలో అసంతృప్తితో ఉన్నవారితో పాటు.. మంత్రివర్గంలో చోటు కోసం అభ్యర్థించేందుకు ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. డీకేకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కూడా ఢిల్లీకి వెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

