లక్నో, జూన్ 7: జ్ఞాన్వాపీ మసీదు కాంప్లెక్స్ వివాదంపై అలహాబాద్ హైకోర్టులో మంగళవారం ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సర్వే సందర్భంగా జ్ఞాన్వాపీ మసీదు పరిధిలో గుర్తించిన నిర్మాణానికి సంబంధించిన వాస్తవికతను నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ లేదా సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. శివుడి భక్తులుగా పేర్కొంటున్న పలువురు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో ఈ పిల్ వేశారు. ఇది జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్, జస్టిస్ సుభాష్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ ముందు ఈనెల 9న విచారణకు వచ్చే అవకాశం ఉన్నది.