లక్నో: ఉత్తర ప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్, తన బాబాయ్ శివపాల్ యాదవ్, కూటమిలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్భర్లకు అల్టిమేటమ్ జారీ చేశారు. వారిద్దరూ స్వేచ్ఛగా ఎస్పీ కూటమిని వీడవచ్చని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్డీయే అభ్యర్థికి వారిద్దరూ మద్దతివ్వడంపై ఆ పార్టీ మండిపడింది. ఈ నేపథ్యంలో శనివారం బహిరంగ లేఖలను ఎస్పీ విడుదల చేసింది. ‘శివపాల్ యాదవ్ జీ, మీకు మరెక్కడైనా ఎక్కువ గౌరవం లభిస్తుందని మీరు భావిస్తే, మీరు స్వేచ్ఛగా పార్టీని విడిచిపెట్టవచ్చు’ అని ఒక లేఖలో పేర్కొంది.
అలాగే ఎస్పీ కూటమికి చెందిన ఎస్బీఎస్పీ అధ్యక్షుడిని ఉద్దేశించి మరో లేఖ విడుదల చేసింది. ‘ఓం ప్రకాష్ రాజ్భర్ జీ, సమాజ్వాదీ పార్టీ నిరంతరం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మీకు మరెక్కడైనా ఎక్కువ గౌరవం లభిస్తుందని అనుకుంటే, మీరు స్వేచ్ఛగా వెళ్లిపోవచ్చు’ అని ఆ లేఖలో స్పష్టం చేసింది. ఈ రెండు లేఖలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
— Samajwadi Party (@samajwadiparty) July 23, 2022
— Samajwadi Party (@samajwadiparty) July 23, 2022