Indian Railways | న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రయాణికులకు రైల్వే శుభవార్త చెప్పింది. ఇక నుంచి రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందజేస్తామని ప్రకటించింది. ఐఆర్సీటీసీ క్యాటరింగ్ పాలసీ కింద నిర్దేశిత సమయం కన్నా రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు ఆలస్యమైన రైళ్లలో ప్రయాణికులకు ఉచిత భోజనం లేదా అల్పాహారం అందజేస్తారు.
రైలు కోసం వేచి చూస్తున్న వారికి, గమ్యాన్ని చేరుకోవడానికి వేచి ఉన్న ప్రయాణికులకు దీనిని అందజేస్తారు. అయితే ఈ ఉచిత భోజన సౌకర్యం రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ప్రీమియం రైలు ప్రయాణికులకే వర్తిస్తుంది.
ఒక వేళ రైళ్ల రాకపోకలలో మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం జరిగినా, దారి మళ్లించినా ప్రయణికుడు కోరితే పూర్తి టికెట్ చార్జీలను వాపసు ఇస్తారు.