ఉచితం వేరు.. సంక్షేమం వేరు
ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు అనేవి రెండూ వేర్వేరు అంశాలు. వాటిని ఒకేగాటన కట్టలేం. అయితే ఇదే సమయంలో రెండింటి మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉన్నది. ఖజానాపై పడే భారాన్ని ఒకవైపు పరిగణనలోకి తీసుకుంటూనే ప్రజాసంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఉచిత హామీలిచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయాలంటున్నారు.
- రెండింటినీ ఒకేగాటన కట్టలేం
- ఉచిత హామీలిచ్చినంత మాత్రాన
- పార్టీల గుర్తింపు రద్దు చేయడమా?
- అది అప్రజాస్వామికమే అవుతుంది
- సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు
- ‘ఉచితం-సంక్షేమం’ అంశంలో సూచనలకు కమిటీ ఏర్పాటు
ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు అనేవి రెండూ వేర్వేరు అంశాలు. వాటిని ఒకేగాటన కట్టలేం. అయితే ఇదే సమయంలో రెండింటి మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉన్నది. ఖజానాపై పడే భారాన్ని ఒకవైపు పరిగణనలోకి తీసుకుంటూనే ప్రజాసంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఉచిత హామీలిచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయాలంటున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి (ఈసీ) అధికారాలు ఇవ్వాలంటున్నారు. అయితే, ఈ అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవాలని నేను
అనుకోవడం లేదు. ఉచిత హామీలను సాకుగా చూపుతూ పార్టీల గుర్తింపును రద్దు చేయాలనటం అప్రజాస్వామికం అవుతుంది.
– చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు రెండూ వేరువేరని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పేదల సంక్షేమాన్ని, ఉచితాలను ఒకేగాటన కట్టరాదని, వాటిని వేర్వేరుగా చూడాల్సిన అవసరమున్నదని నొక్కి చెప్పింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ప్రకటించే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలనడం అప్రజాస్వామికం అవుతుందని అభిప్రాయపడింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ న్యాయవాది, బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారీ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారించింది.
విచారణ సమయంలో సీజేఐ కీలక వ్యాఖ్యలు
- ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు అనేవి రెండూ వేర్వేరు అంశాలు. వాటిని ఒకేగాటన కట్టలేం. అయితే ఇదే సమయంలో రెండింటి మధ్య సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉన్నది. ఖజానాపై పడే భారాన్ని ఒకవైపు పరిగణనలోకి తీసుకుంటూనే ప్రజాసంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.
- ఉచిత హామీలిచ్చే పార్టీల గుర్తింపును రద్దు చేయాలంటున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి (ఈసీ) అధికారాలు ఇవ్వాలంటున్నారు. అయితే, ఈ అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవాలని నేను అనుకోవడం లేదు. ఉచిత హామీలను సాకుగా చూపుతూ పార్టీల గుర్తింపును రద్దు చేయాలనడం అప్రజాస్వామికం అవుతుంది.
- న్యాయస్థానాలు శాసనవ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నాయన్న అపవాదు ఇప్పటికే ఉండనే ఉంది. కాబట్టి, ఉచితహామీలు, సంక్షేమ పథకాల వ్యవహారంలో ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకోలేం. ఇది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి, ఈ వ్యవహారంలో సూచనలు ఇవ్వడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు ఇప్పటికే సిఫారసు చేశాం.
- ఈ కమిటీలో ఈసీ, కేంద్రప్రభుత్వం, ఆర్బీఐ, ఫైనాన్స్ కమిషన్, లా కమిషన్‌కు చెందిన సభ్యులు భాగంగా ఉంటారు.
- సంక్షేమ ఫలాలు అందుకునే వారికి అవి మరింతగా కావాలని ఉంటుంది. మరోవైపు, పన్నులు చెల్లించే వారు అభివృద్ధి పనులు జరుగాలని డిమాండ్ చేస్తారు. ఈ రెండు అంశాలు అత్యంత సున్నితమైనవి. ఇరువర్గాల వాదనలను కమిటీ సభ్యులు లోతుగా వినాల్సి ఉంటుంది.
- ఆగస్టు 26న నేను పదవీ విరమణ చేస్తున్నా. కాబట్టి, అంతకుముందే ఈ వ్యవహారం కొలిక్కివస్తే బాగుంటుంది. తదుపరి విచారణను 17కు వాయిదా వేస్తున్నా.
ఏమిటీ కేసు?
ఎన్నికల సమయంలో ఉచిత హామీలిచ్చే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారాలు ఈసీకి ఇవ్వాలని పేర్కొంటూ బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయ సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఉచిత హామీలను ఆసరాగా చేసుకొనే కొన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలోకి దిగుతున్నాయని, ఆర్థిక వ్యవస్థకు ఈ సంప్రదాయం ఎంతో నష్టదాయకమని వాదించారు. మరోవైపు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో తాము భాగం కాలేమని ఈసీ వెల్లడించింది. ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు ఉన్న కమిటీలో రాజ్యాంగబద్ధమైన సంస్థ ఉండకూడదని అభిప్రాయపడింది. ఇది సంస్థకు తీరని నష్టం చేకూర్చవచ్చని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

