న్యూఢిల్లీ: ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో శనివారం నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నార్త్ ఈస్ట్ జిల్లా అదనపు డీసీపీ సందీప్ లాంబా తెలిపిన వివరాల ప్రకారం, సహాయక బృందాలు 14 మందిని కాపాడాయి.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు పది మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని ఆందోళన వ్యక్తమవుతున్నది. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారి రాజేంద్ర అట్వల్ చెప్పారు.