US Green Card: అమెరికా గ్రీన్‌కార్డు అందుకోకుండానే.. ప్రాణాలు కోల్పోనున్న 4 లక్షల మంది భారతీయులు!
US Green Card: సుమారు నాలుగు లక్షల మంది భారతీయులు అమెరికా గ్రీన్ కార్డును అందుకోకుండానే ప్రాణాలు విడిచే అవకాశాలు ఉన్నట్లు ఓ రిపోర్టులో తేలింది. లక్షలాది మంది భారతీయులు ఆ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ లిస్టును క్లియర్ చేయడానికి 134 ఏళ్లు పడుతుందట.
న్యూఢిల్లీ: అమెరికా జారీ చేసే గ్రీన్ కార్డు(US Green Card) కోసం ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో వలసదారులు వేచి చూస్తుంటారు. అయితే ఆ కార్డు జారీలో జరుగుతున్న ఆలస్యం వల్ల .. సుమారు నాలుగు లక్షల మంది భారతీయులు ఆ కార్డును అందుకోకుండానే ప్రాణాలు విడిచే అవకాశాలు ఉన్నట్లు ఓ రిపోర్టులో తేలింది. అమెరికాకు చెందిన క్యాటో ఇన్స్టిట్యూట్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ విషయం వెల్లడైంది. అమెరికా ఎంప్లాయిమెంట్ ఆఫీసు వద్ద గ్రీన్ కార్డు కోసం సుమారు 11 లక్షల మంది భారతీయుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వారందరికీ ఇప్పట్లో కార్డు అందడం అసాధ్యంగా కనిపిస్తోంది. అమెరికా ఎంప్లామెంట్ శాఖ వద్ద మొత్తం 18 లక్షల గ్రీన్ కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, దాంట్లో 63 శాతం దారఖాస్తులు భారతీయులవే అని తెలుస్తోంది. వీటికి తోడు ఫ్యామిలీ సిస్టమ్‌తో లింకు ఉన్న గ్రీన్ కార్డులు సుమారు 83 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
క్యాటో ఇన్స్టిట్యూట్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం.. కొత్తగా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులకు.. వెయిటింగ్ అనేది ఓ జీవితకాల శిక్షగా మారనున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఆ శాఖ వద్ద ఉన్న దరఖాస్తుల్ని క్లియర్ చేయాలంటే దాదాపు 134 ఏళ్లు పడుతుందట. ఇక సుమారు 4,24,000 మంది గ్రీన్ కార్డు కోసం ఎదురూచూస్తూ తమ ప్రాణాల్ని కోల్పోయే ప్రమాదం ఉందని, దీంట్లో 90 శాతం మంది భారతీయులే ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

