ఆరు నెలల్లో నలుగురు ఖలిస్థాన్ నేతల హతం
భారత్‌లో ఖలిస్థాన్ వేర్పాటువాదాన్ని తిరిగి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఖలిస్థాన్ ఉగ్రవాద నేతలు వరుసగా మరణిస్తున్నారు. ఖలిస్థాన్ ముఖ్యనేత అమృత్‌పాల్‌సింగ్ ఇటీవల అరెస్టు అయిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ, జూన్ 20: భారత్‌లో ఖలిస్థాన్ వేర్పాటువాదాన్ని తిరిగి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఖలిస్థాన్ ఉగ్రవాద నేతలు వరుసగా మరణిస్తున్నారు. ఖలిస్థాన్ ముఖ్యనేత అమృత్‌పాల్‌సింగ్ ఇటీవల అరెస్టు అయిన సంగతి తెలిసిందే. తాజాగా కెనడాలో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్సింగ్ నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఆరు నెలల వ్యవధిలోనే నలుగురు ఉగ్రవాద నేతలు హతమవడం గమనార్హం. వీరందరూ విదేశాల్లోనే మరణించారు. ఆదివారం గురుద్వారా వద్ద హర్దీప్సింగ్ మరణించగా, మిగతా వారు కూడా విదేశాల్లోనే మృతిచెందారు.
భారత ఎంబసీలపై దాడులు…
మే 6న లాహోర్‌లో తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తున్న ఖలిస్థాన్ కమాండర్ ఫోర్స్ చీఫ్ పరమ్‌జీత్ సింగ్‌ను దుండగులు బైక్‌పై వచ్చి కాల్చి చంపారు. గతవారం యూకేలో ఖలిస్థాన్ ముఖ్య నేత అవతార్‌సింగ్ ఖండా అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దవాఖానలో క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న ఆయన మరణించాడు. ఆయన మరణానికి విష ప్రయోగమే కారణమని పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో లాహోర్‌లోని ఓ గురుద్వారా వద్ద హర్మీత్సింగ్ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. కాగా, నిజ్జర్ మృతికి భారత నిఘా విభాగం అధికారులే కారణమని కెనడాలోని సిక్కు సంస్థలు ఆరోపించాయి. ఇటీవల యూకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాలో ఖలిస్థాన్ ఉగ్రవాదుల ఆగడాలు శృతిమించాయి. భారత ఎంబసీ వద్ద ఆందోళనలు చేస్తున్నారు. లండన్‌లో భారత జెండాను అవమానించాలని ప్రయత్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

