అహ్మదాబాద్, మే 20: గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరిని శ్రీలంక దేశస్థులుగా భావిస్తున్నారు. వీరు మొదట చెన్నైకు వచ్చి అక్కడి నుంచి అహ్మదాబాద్ వచ్చినట్టు తెలుస్తున్నది. తామేం పనులు చేయాలనే విషయంలో పాకిస్థానీ హ్యాండ్లర్ల నుంచి వచ్చే ఆదేశాల కోసం వీరు ఎదురు చూస్తున్నట్టు సమాచారం. పాకిస్థాన్ నుంచి ఎలాంటి ఆయుధాలను స్వీకరించక ముందే ఈ నలుగురిని అరెస్ట్ చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.