కలబురగి: కర్ణాటకలోని కలబురగిలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరగుట్టి క్రాస్ వద్ద లారీ, కారు ఢీకొనడంతో కారులోని ప్రయాణికులు మరణించారు. వీరిలో హైదరాబాద్కు చెందిన భార్గవ్ కృష్ణ (55), ఆయన సతీమణి సంగీత (45), వారి కుమారుడు ఉత్తమ్ రాఘవన్ (28) ఉన్నారు.
మృతుల్లో కారు డ్రైవర్ కూడా ఉన్నారు. వీరు గాణగాపురలోని దత్తాత్రేయ దేవాలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.