అక్రమ మద్యం తయారుచేస్తూ నలుగురు మృతి
అక్రమ మద్యం| ఉత్తరప్రదేశ్‌లో అక్రమ మద్యం తయారు చేస్తూ నలుగురు మృత్యువాత పడ్డారు. మొరదాబాద్ జిల్లాలోని రాజ్పూర్ కెసారియాలోని ఓ ఇంట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తుండగా విషపూరిత వాయువులు వెలువడ్డాయి. దీంతో వారంతా మృతిచెందారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ మద్యం తయారు చేస్తూ నలుగురు మృత్యువాత పడ్డారు. మొరదాబాద్ జిల్లాలోని రాజ్పూర్ కెసారియాలోని ఓ ఇంట్లో అక్రమంగా మద్యం తయారు చేస్తుండగా విషపూరిత వాయువులు వెలువడ్డాయి. దీంతో వారంతా అక్కడికక్కడే మృతిచెందారు. రాజ్పూర్ కెసారియా గ్రామానికి చెందిన రాజేంద్ర సింగ్ గత కొంతకాలంగా అక్రమ మద్యం తయారు చేస్తున్నాడు. దీనికోసం తన ఇంటి బేస్మెంట్లో ఓ గదిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో నిన్న రాజేంద్ర సింగ్‌తోపాటు అతని ఇద్దరు కుమారులు, ఓ కూలీ అందులోకి వెళ్లారు. అయితే అక్కడ ఆవు పెండ, రసాయన పదార్థాలు నిలువ ఉంచారు. దీంతో విషపూరిత వాయువులను పీల్చుకుని నలుగురు అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని గమనించిన రాజేంద్ర సింగ్ భార్య ఫూల్వతి ఇరుగుపొరుగువారికి చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే వారు మృతిచెందారు.
కాగా, ఏడాది క్రితం రాజేంద్ర సింగ్ ఇంట్లో 250 బాక్సుల అక్రమ మద్యం లభించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా అతడు అదే పనిచేస్తున్నాడని మొరదాబాద్ ఎస్ఎస్పీ పవన్ కుమార్ వెల్లడించారు. విషపూరిత వాయువులు పీల్చుకోవడంతోనే నలుగురు మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

