Cyclone Mandous: భారీ వర్షాలు నలుగురిని బలి తీసుకున్నాయి: తమిళనాడు సీఎం
Cyclone Mandous | తమిళనాడులో మండూస్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత అర్ధరాత్రి మామల్లపురం దగ్గర గంటకు 75 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకిన మండూస్ తుఫాను..
చెన్నై: తమిళనాడులో మండూస్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత అర్ధరాత్రి మామల్లపురం దగ్గర గంటకు 75 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకిన మండూస్ తుఫాను.. ఆ తర్వాత బలహీనపడి తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. తుఫానువల్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
అదేవిధంగా 98 పశువులు మృతిచెందాయి. మరోవైపు 181 నివాసాలు దెబ్బతిన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ వివరాలను మీడియాకు తెలియజేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆయన ఇవాళ పరిశీలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న తీరును అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
తుఫాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నైతోపాటు సముద్ర తీర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచి తటాకాలను తలపిస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగిపోవడంతో అంధకారం నెలకొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
Sreeleela | అందుకే టాలీవుడ్‌కు దూరం..! క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
Kamal Haasan| సేయాన్లో విరుమాండి గెటప్.. అతిథి పాత్రలో కనిపించనున్న కమల్‌హాసన్..!
Jain Diksha | కోట్లాది వ్యాపారాన్ని వదిలి సన్యాసం..! సూరత్‌లో ఓ కుటుంబం నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

