కారులో అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలు సీజ్.. 90 కిలోమీటర్లు చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
Pistols Seized |
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్ జిల్లాలో అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్న దుండగులను పోలీసులు సినీ ఫక్కీలో చేజ్ చేశారు. దుండగుల కారును ఏకంగా 90 కిలోమీటర్లు చేజ్ చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే దుండగులు కారును వదిలి పారిపోయారు. అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో మధ్యప్రదేశ్ పోలీసులు ఇవాళ ఉదయం ఇండోర్లో ఆగ్రా-ముంబై జాతీయ రహదారిపై హర్యనా రిజిస్టర్డ్ కారును అడ్డగించారు.
అయితే, నలుగురు దుండగులు కారును ఆపకుండా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మరింత వేగంగా పోనిచ్చారు. దాంతో పోలీసులు వారిని వెంబడించారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఒకచోట దుండగులు పోలీస్ వాహనాన్ని ఢీకొట్టారు. చివరకు ఇండోర్కు 90 కిలోమీటర్ల దూరంలోని ఖల్ఘాట్కు చేరుకున్నారు. అక్కడ బారీకేడ్లను ఢీకొట్టి కారును అక్కడే వదిలేసి నలుగురు దుండగులు పారిపోయారు.
దాంతో కారులో వెతికిన పోలీసులకు భారీగా మారణాయుధాలు లభ్యమయ్యాయి. అందులో 40 పిస్తోల్లు, 36 మ్యాగజీన్లు, ఐదు క్యాట్రిడ్జ్లు ఉన్నాయి. ఈ ఆయుధాలు విదేశాల్లో తయారయినవని పోలీసులు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

