న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఉచిత బియ్యం పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, ఇతర సంక్షేమ కార్యక్రమాల కింద ఉచితంగా సరఫరా చేస్తున్న బలవర్ధకమైన బియ్యం పథకాలను 2028 డిసెంబర్ వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయించింది.
పౌరుల్లో రక్తహీనత, సూక్ష్మ పోషక లోపాల నివారణకు సరఫరా చేయనున్న ఈ బియ్యం పథకానికి రూ.17,082 కోట్లను వెచ్చించనుంది. ఈ పథకానికి అయ్యే వ్యయాన్నంతా కేంద్రమే భరిస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.