Drug Case : డ్రగ్స్ కేసులో మాజీ రెజ్లర్ అమిత్(Amit) అరెస్టయ్యాడు. గత మూడేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న అతడు ఎట్టకేలకు చిక్కాడు. శుక్రవారం అతడిని ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమిత్ అరెస్టుతో జార్ఘండ్ నుంచి ఢిల్లీకి వ్యాపించిన ఓపియమ్ నెట్వర్క్ బయటపడుతుందని దర్యాప్తు బృందం భావిస్తోంది.
రాంచీ డ్రగ్ కేసులో నిందితుడు, మాజీ రెజ్లర్ అమిత్ ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. ఎన్డీపీఎస్ కేసులో మూడేళ్లుగా పరారీలో ఉన్న అతడిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. 2013లో జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో కాంస్యం నెగ్గిన అమిత్.. అనూహ్యంగా డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడు. 2023, ఏప్రిల్ 20వ తేదీన 500 గ్రాముల నిషేధిత డ్రగ్ లభ్యమైన కేసులో.. పోలీసులు విచారణ చేపట్టగా అమిత్ పేరు బయటకొచ్చింది.
Former national wrestler arrested in Ranchi drug case after 3 years on the run#Jharkhand #Ranchi #RanchiPolice https://t.co/c1vSEAVuJa
— IndiaToday (@IndiaToday) August 22, 2026
అప్పటి నుంచి పరారీలో ఉన్న అమిత్ ఢిల్లీలో ఉన్నట్టు రాంచీ పోలీసులకు సమాచారం అందింది. దాంతో, ఢిల్లీ నేర విభాగం పోలీసులను సంప్రదించి అతడి కోసం వేట మొదలెట్టారు. ఆగస్టు 18వ తేదీన రాంచీ, ఢిల్లీ పోలీసులు స్థానిక రోహిణి ప్రాంతంలో దాడులు చేయగా..అమిత్ పట్టుబడ్డాడు. అనంతరం రాంచీ కోర్టులో అమిత్‌ను ప్రవేశ పెట్టగా.. రిమాండ్ విధించారు.