న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీకి రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న రాష్ట్రీయ స్మృతి ఏరియా కాంప్లెక్స్‌లో స్మారకం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం ప్రధాని మోదీని కలిసిన ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. స్మృతి కాంప్లెక్స్‌లో తన తండ్రి సమాధిని స్మారకంగా నిర్మించడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆమె పేర్కొన్నారు.
మన్మోహన్ సింగ్ స్మారక నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం అంగీకరించినా..స్థలాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఆయన కుటుంబ సభ్యులను సంప్రదించాక ఆయనకూ రాష్ట్రీయ స్మృతి ఏరియా కాంప్లెక్స్‌లోనే స్మారకాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.