భువనేశ్వర్: ఒడిశాలోని నబరంగ్పుర్ మాజీ ఎంపీ, బీజేడీ నేత ప్రదీప్ మాఝీపై గిరిజన సంఘం కుల బహిష్కరణ వేటు వేసింది. కేంద్రపారా జిల్లాకు చెందిన సంగీత సాహును ప్రేమించిన ప్రదీప్ మార్చి 12న గోవాలో వివాహం చేసుకున్నారు.
ఆమె గిరిజనేతరురాలు కావడంతో గిరిజన భత్ర సమాజ్ వ్యతిరేకించింది. ఈ సమాజ్ కేంద్ర కమిటీ సమావేశమై ప్రదీప్తోపాటు ఆయన కుటుంబంలో మరికొందరు కూడా గిరిజనేతరులను వివాహం చేసుకున్నట్లు నిర్ధారించుకున్నారు. ఈ కుటుంబ సభ్యులందరినీ 12 ఏండ్లపాటు తమ సంఘం నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు. ప్రదీప్ సోదరుడు ప్రసన్న స్పందిస్తూ.. ఈ తీర్పునకు కట్టుబడి ఉంటామని చెప్పారు.