Ajay Chautala | 10 ఏళ్ల తర్వాత తిహార్ జైలు నుంచి విడుదలైన అజయ్ చౌతాలా
దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష అనంతరం మాజీ ఎంపీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నేత అజయ్ చౌతాలా గురువారం తిహార్ జైలు నుంచి నుంచి విడుదలయ్యారు. హర్యానా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దుష్యంత్ చౌతాలా ఈయన కుమారుడే. అజయ్ చౌతాలా జైలు నుంచి బయటికి రావడంతో ఆయన మద్దతుదారులు ఆయనకు బోకేలు అందజేసి స్వాగతం పలికారు. ప్రస్తుతం అజయ్ చౌతాలా కుమారుడు దుష్యంత్ చౌతాలా హర్యానా ఉప ముఖ్యమంత్రితో పాటు పార్టీ బాధ్యతలు కూడా చూస్తున్నారు.
హర్యానాలో టీచర్ల రిక్రూట్మెంట్లో అవినీతి జరిగిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో అజయ్ చౌతాలా, ఆయన తండ్రి, మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు జైలు శిక్ష పడింది. 2000 సంవత్సరంలో హర్యానాలో టీచర్ల రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగాయి. 3,206 మంది టీచర్ల రిక్రూట్మెంట్లో అవినీతి జరిగిందని చౌతాలాతో పాటు మరో 55 మందిపై కేసులు నమోదయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Peace Prize: భారత సంతతి మహిళ నవనీతం నావి పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి
Manne Krishank | అనుముల ఫ్యామిలీ కాదు..అనకొండ ఫ్యామిలీ : మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

