CM KCR | (ఔరంగాబాద్ నుంచి నమస్తే తెలంగాణ బృందం) ఏప్రిల్ 24( నమస్తే తెలంగాణ) : తమకు కేసీఆర్ తప్ప మరో ప్రత్యామ్నాయ నాయకుడు లేడని కన్నాడ్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ అన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా, సాగునీరు, తాగునీరు లాంటి మౌలిక సమస్యలు పరిష్కారం కావాలన్నా ఆయనతోనే సాధ్యమని స్పష్టంచేశారు. సోమవారం మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో హర్షవర్ధన్ మాట్లాడుతూ, మహారాష్ట్ర రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప, ప్రజలకోసం పనిచేయటం లేదని మండిపడ్డారు. ఇక్కడ అధికారంలోకొచ్చిన పార్టీల నాయకులంతా తమ ఆస్తులను పెంచుకొన్నారు తప్ప, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ దేవుడిలా వచ్చారని, తెలంగాణ మాడల్ తరహా మహారాష్ట్ర అభివృధ్ధి కావాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు విజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు. ఎన్సీపీ మాజీ అధికార ప్రతినిధి ప్రదీప్ సోలంకే మాట్లాడుతూ, తాను తెలంగాణలో వివిధ గ్రామాలు తిరిగి స్వయంగా ప్రజలతో నేరుగా మాట్లాడానని పేర్కొన్నారు. తన అనుభవాలను పుస్తకరూపంలో అచ్చువేశానని, వేల సంఖ్యలో ఆ పుస్తకాలను ఉచితంగా పంచుతున్నట్టు చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ గత 8 ఏండ్లలో చేసిన అభివృధ్ధిని కళ్లారా చూసి తాను ఆ పుస్తకాన్ని రాసినట్టు వివరించారు.
కేసీఆర్ నీకు మహారాష్ట్రలో ఏం పని? అని దేవేంద్ర ఫడ్నవీస్ అడుగుతున్నడు. ఆయనకు సవాల్ చేస్తున్న. తెలంగాణలో లాగా రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వు, రైతుబంధు, రైతుబీమా ఇవ్వు. దళితబంధు ఇవ్వు. నా మిషన్ నెరవేరినట్టే. మీరు అవి చేసి చూపించండి. నేను మహారాష్ట్రకు మళ్లీ రాను. మధ్యప్రదేశ్ పోతాను.
– సీఎం కేసీఆర్
‘తెలంగాణ సీఎం కేసీఆర్ జరూర్ ఆనా .. మహారాష్ట్రకో బదల్నా’ ఇదీ ఛత్రపతి శంభాజీనగర్ బహిరంగ సభ అనంతరం మరాఠీ ప్రజల అభిమతం. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రసంగంతో కొత్త ఉత్సాహంతో తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఒకనాడు తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎంతగా పోరాటం చేసిందో.. ఎన్ని కలలను కన్నదో నేడు మరాఠీ జనం సైతం వాటి కోసమే అంతగా పోరాటం చేస్తున్నది. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కలలు, ఆశలు ఫలించిన తీరుగానే తమ కలలు నెరవేరుతాయనే విశ్వాసం సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరిలో తొణికిసలాడింది.
ఛత్రపతి శంభాజీనగర్‌లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ సభకు మరాఠీ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సభ మహారాష్ట్రలో కొత్త చరిత్రకు నాంది పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరాఠీ ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు తమకూ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఛత్రపతి శంభాజీనగర్ రాజకీయవర్గాల్లో, యువతలో కొత్త చర్చకు తెరలేచింది. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం మరాఠీ ప్రజల్లోకి పెద్దఎత్తున దూసుకెళ్తుతున్నది. ప్రచార పర్వంలో భాగంగా తెలంగాణలో అందుతున్న రైతుబంధు, రైతుబీమా, సాగుకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు వంటి అంశాలపై ఫోకస్ చేయడం ఈ ప్రాంత రైతులను కదిలించింది. దశాబ్దాలుగా తమతో ఓట్లు వేయించుకున్నారే తప్ప ఇక్కడి పాలకులు ఏనాడూ కేసీఆర్ తరహాలో సంక్షేమాన్ని పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఇక ఈ ప్రభుత్వాలు మాకు వద్దంటూ నినదిస్తున్నారు. కిసాన్ సర్కార్ బీఆర్ఎస్ వెంటనే నడుస్తామని ప్రతిజ్ఞ పూనుతున్నారు. రైతుకు అండగా నిలిచే కేసీఆరే కావాలని ఆకాంక్షిస్తున్నారు. నాందేడ్, లోహా సభల స్ఫూర్తితో మరోమారు ఔరంగాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ సభకు ఊహించని రీతిలో జనం తరలిరావడమే ఇందుకు నిదర్శనం.
Goundhade
కేసీఆరే … సరైనోడు
భారతదేశం ఇప్పుడు ప్రమాదపు అంచుల్లో చిక్కుకున్నది. విద్వేషపు మంటల్లో కొట్టుమిట్టాడుతున్నది. అభివృద్ధి అనే నినాదం ప్రజలకు దూరమై ఎనిమిదేండ్లవుతున్నది. కాబట్టి దేశం మళ్లీ ప్రగతి మార్గంలో నడవాలంటే, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలంటే దేశానికి సరైన నాయకుడు కావాలి. యావత్ దేశాన్ని నడిపించే సత్తా ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నది. పేదరిక నిర్మూలన, సహజ వనరుల వినియోగం, ప్రజల జీవితాల్లో మార్పు, అన్నిరంగాల్లో సమూల మార్పులు జరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్టు. అది చేయగలిగే ఏకైక నాయకుడు కేసీఆర్.
– గోందాడే, అహ్మద్‌నగర్
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం చాలా గర్వకారణం
నా కండ్ల ముందు ఎంతో మంది పాలకులు మారారు. కానీ ఏ ఒక్కరూ బాధలు పట్టించుకోలె. ఇక్కడ క్విం టా ఉల్లి 2 వేలు. పెట్టుబడీ చేతికి రావట్లేదు. కరెంటు ఉండదు. నీళ్లు ఇవ్వరు. ఏ సర్కారు కూడా కిసాన్ ఇజ్జత్ కాపాడలే. తెలంగాణ అచ్చా రాజ్ హై. కేసీఆర్ అచ్చా హై. తెలంగాణ రైతులకు కేసీఆర్ అంతగా చేస్తున్నప్పుడు ఇక్కడ పాలకులు ఎందుకు చేయటం లేదు? కిసాన్ సర్కార్ వస్తేనే రైతుల బతుకు మారుతుంది. ఈ సారి ఎవరెన్ని చెప్పినా వినేది లేదు. కేసీఆర్‌కే మా ఓటు.
– ఆశారాం బన్కర్, మాలవాడి (ఔరంగాబాద్)
కేసీఆర్‌ను చూద్దామనే వచ్చా..
నీళ్లు ఉంటే పంటలు. రైతుల వద్ద పైసలుంటయ్. అట్లయితేనే ఉద్యోగాలు. వ్యాపారాలు నడుస్తయ్. అయినా ఇక్కడి పాలకులు ఎప్పుడు నీళ్ల మీద దృష్టి పెట్టలేదు. చిన్న కల్వర్టు కట్టడానికి కూడా ఐదారేండ్ల సమయం తీసుకుంటున్నా రు. ఇక ప్రాజెక్టులు ఎప్పుడు కడతారు. ఓట్లు వేయించుకోవడం ముఖం తిప్పేయటం. కేసీఆర్ లాంటి సత్తా ఉన్న నాయకుడితోనే మార్పు సాధ్యం. తెలంగాణలో అభివృద్ధి గురించి నిత్యం పేపర్లలో చూస్తున్నాం. విం టూ ఆశ్చర్యపోతున్నాం. ఇక్కడ గ్రామాల్లో ఇప్పుడు ఇదే చర్చ. కేసీఆర్ లాంటి మహానాయకుడిని చూద్దామనే మీటింగ్‌కు వచ్చా. ఇక్కడ కచ్చితంగా బీఆర్ఎస్ గెలుపొందుతుంది.
– అశోక్ ఓంకార్ (శంభాజీనగర్)
వో తాకత్ కేసీఆర్‌కో హై
మహారాష్ట్ర పాలకులకు అన్నీ తెలుసు. కానీ పట్టించుకోరు. ఎంతసేపు ఓట్ల రాజకీయమే. ప్రతిపక్షంలో ఉన్నంత వరకు నీళ్ల కష్టాలు, రైతుల ఆత్మహత్యలు అంటూ మాట్లాడుతరు. ఆందోళనలు చేస్తారు. వారు అధికారంలోకి రాగానే మళ్లీ నోరుమెదపరు. బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన అందరూ దొంగలే. మరాఠీ రైతుల కిస్మత్ బదల్నాహై. వో తాకత్ కేసీఆర్ కో హై.
– భీంరావు పార్తే (శంభాజీనగర్)
మహారాష్ట్ర రాజకీయాలకు మంచి రోజులు
మహారాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టాయి. కేసీఆర్ చెప్పినట్టు ఇక్కడ నీళ్లు ఉన్నాయి. సంపద ఉన్నది. పనిచేసేందుకు యువతీయువకులు ఉన్నా రు. కానీ ఇక్కడి నాయకులు మాత్రం సక్కగా లేరు. కేసీఆర్ మాదిరిగా ఒక అభివృద్ధి ఎజెండా లేదు. ప్రణాళిక లేదు. కేసీఆర్ మహారాష్ట్రకు రావటం ఆనందంగా ఉన్నది.
– హిమాబాయి పఠాన్, అహ్మద్‌నగర్ జిల్లా
కేసీఆర్ మహిళలకు మంచి చేస్తున్నరు
మహారాష్ట్ర లో మహిళల పరిస్థితి దారుణంగా ఉన్న ది. డెలివరీకి జిల్లా కేంద్రానికి వెళ్లాలి. రోడ్లు కూడా సక్కగ ఉండవు. ప్రసూతికి వెళ్లి రావడమంటే చచ్చిబతకడమే. ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు కూ డా ఉండవు. తెలంగాణలో అన్ని సౌలతులు కల్పిస్తున్నారు. రోజూ మా ఊర్ల లో చర్చ జరుగుతున్నది. కేసీఆర్ రావాలని మేమూ అదే కోరుకుంటున్నాం.
– ఆశాబాయి (కన్నాడ్)
Jija Bhai
తాగునీళ్లు ఇస్తే చాలు
ఏం చెప్పమంటరు. మంచినీళ్లకు పాట్లు పడుతున్నాం. వారానికి ఒక్కరోజు ఇస్తున్నారు. ఒక్కోసారి 8 రోజులకు కూడా ఇవ్వరు. ఇచ్చినా గంట కూడా రావు. వచ్చినప్పుడే పట్టి పెట్టుకోవాలి. లేదంటే ట్యాంకర్ల నుం చి కొనుక్కోవాలి. నీళ్లు ఇవ్వరు కానీ బిల్లు మాత్రం పెద్దమొత్తంలో వసూలు చేస్తారు. కేసీఆర్ తెలంగాణలో నీళ్ల సౌలతు మంచిగా చేశాడు. నీళ్లు ఎవరు ఇస్తే వారి వెంటే మేం నడుస్తాం.
– జిజాబాయి (రాజ్‌నగర్)