రాంచి: జార్ఖండ్‌లో అధికార జేఎంఎం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి కీలక నేత, మాజీ సీఎం చంపయీ సొరేన్ గుడ్‌బై చెప్పనున్నారు. తాను కొత్త పార్టీని స్థాపించి బలోపేతం చేస్తానని బుధవారం ఆయన ప్రకటించారు. వారం రోజుల్లో అన్ని వివరాలూ చెప్తానని అన్నారు. ఈ క్రమంలో నమ్మకమైన స్నేహితుడు కలిసి వస్తే కలుపుకొని వెళ్తానని తెలిపారు. మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంపయీ సొరేన్ నిర్ణయం జార్ఖండ్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది. హేమంత్ సొరేన్ జైలుకు వెళ్లిన సమయంలో ఐదు నెలల పాటు చంపయీ సీఎంగా పని చేసిన సంగతి తెలిసిందే.