న్యూఢిల్లీ: గతంలో అమెరికాకు భారతీయ అంబాసిడర్‌గా చేసిన తరన్‌జిత్ సింగ్ సంధూ(Taranjit Singh Sandhu) ఇవాళ బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ తరపున పంజాబ్‌లోని అమృత్సర్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన కార్యదర్శులు వినోద్ తవడే, తరుణ్ చుగ్ సమక్షంలో సంధూ పార్టీ చేరారు. అమెరికా, భారత్ మధ్య బంధం బలోపేతం అయ్యిందని సంధూ తెలిపారు. రెండు దేశాల మధ్య అభివృద్ధిపై ఫోకస్ చేశామని, సెమీకండక్టర్ పరిశ్రమలో ఇంకా వృద్ధి సాధించాల్సి ఉందన్నారు. తన రాజకీయ ఇన్నింగ్స్‌కు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు ఆయన థ్యాంక్స్ తెలిపారు.