న్యూఢిల్లీ, మే 21: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు న్యాయస్థానంలో మరోసారి ఎదురుదెబ్బ తగలింది. ఆయన బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. కేసు విచారణ కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో సిసోడియాకు బెయిల్ మంజూరు చేయడం సబబు కాదంటూ ఏప్రిల్ 30న ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సిసోడియా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.