భోపాల్, సెప్టెంబర్ 2: కానిస్టేబుల్‌గా పనిచేస్తూ విధుల నుంచి సస్పెండైన ఒక వ్యక్తి.. తర్వాత యోగిగా మారి.. అనంతరం న్యాయపోరాటంతో 27 ఏండ్ల తర్వాత తిరిగి విధుల్లో చేరిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ మోరెనాకు చెందిన గిర్వర్ సింగ్ తోమర్ సీఆర్పీఎఫ్లో 1991లో హవల్దార్‌గా చేరాడు. ఎనిమిదేండ్ల సర్వీస్ తర్వాత 1999లో పై అధికారితో వివాదం ఏర్పడటంతో అతడిని విధుల నుంచి తొలగించారు.
దీంతో తన సొంత ఊరుకు వచ్చిన ఆయన ఒక ఆలయంలోనే ఉంటూ దేవుడి సేవలో, ధ్యానంలో గడిపేవాడు. తర్వాత ఒక గుహాలయానికి చేరుకున్న ఆయన యోగిగా మారాడు. కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో 27 ఏండ్ల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ సీఆర్పీఎఫ్లో విధుల్లో చేరాడు.