Meenakshi Natrajan: ఏదీ దాచిపెట్టలేదు.. ఫామ్ 26లో అడిగిన వివరాలిచ్చా: మీనాక్షీ నటరాజన్
Meenakshi Natrajan: ఫామ్ 26లో అడిగిన వివరాలన్నీ ఇచ్చినట్లు మీనాక్షీ నటరాజన్ చెప్పారు. తాను ఏదీ దాచిపెట్టలేదన్నారు. సుప్రీంకోర్టులోనూ ఆ వివరాలనే వెల్లడించనున్నట్లు ఆమె తెలిపారు. ఢిల్లీలో ఇవాళ మీడియాతో మీనాక్షీ మాట్లాడారు. మీనాక్షీ దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత మీనాక్షీ నటరాజన్(Meenakshi Natrajan) మధ్యప్రదేశ్ నుంచి దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్‌ను స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉందని, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, లీగల్ అంశాలపై తాను ఎక్కువ లోతులో మాట్లాడలేనని తెలిపారు. కానీ ఈ సమస్యకు సంబంధించిన వివరాలన్నీ ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉన్నట్లు ఆమె చెప్పారు.
తన సమస్య మొత్తం ఫామ్ 26 చుట్టు తిరుగుతోందని, ఫామ్ 26లో కొన్ని విషయాలు దాచిపెట్టినట్లు తనపై ఆరోపణలు వచ్చాయని, కానీ ఫామ్ 26లో ఆ విషయాలను వెల్లడించే కాలమ్ ఏదీ లేదని ఆమె అన్నారు. తన రాజ్యసభ నామిషేన్ తిరస్కరణ కావడానికి ఫామ్ 26 ప్రధాన కారణమని, పెండింగ్ కేసులకు చెందిన సమాచారాన్ని వెల్లడించలేదని ఆరోపణలు ఉన్నాయని, కానీ ఇది తనకు వర్తించదని చెప్పారు. తనకు కేవలం లీగల్ నోటీసులు మాత్రమే ఇచ్చారని అన్నారు. ఈసీకి సమర్పించిన మెమోరండంలో ఆ లీగల్ వివరాలను వెల్లడించినట్లు చెప్పారు. సుప్రీంకోర్టులోనూ ఆ నిజాలను సమర్పించినట్లు ఆమె తెలిపారు.
గతంలో తనకు కేవలం లీగల్ నోటీసు మాత్రమే వచ్చిందని, కానీ ఆ కేసులో కోర్టు కనీసం తన అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదన్నారు. అయితే ఫామ్ 26లో ఎక్కడా లేని అంశాన్ని ఎలా పొందుపరుస్తారని ఆమె అన్నారు. ప్రైవేటు ఫిర్యాదులపై సమాచారాన్ని వెల్లడించేందుకు ఫామ్ 26లో ఎటువంటి కాలమ్ లేదని ఆమె తెలిపారు. ఒకవేళ అలాంటి కాలమ్ ఏదైనా ఉంటే, కచ్చితంగా ఆ సమాచారాన్ని వెల్లడించే దాన్ని అని మీనాక్షీ పేర్కొన్నారు.
#WATCH | Delhi: Congress Meenakshi Natrajan whose Rajya Sabha nomination was rejected, says, “Since the matter is sub judice, and currently being heard by the Supreme Court, I will not discuss it in great detail or delve into all the legal aspects today. However, one specific… pic.twitter.com/ZxL7B4nhMi
— ANI (@ANI) June 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

